ఆముదాలవలస అబ్బాయి - అమెరికా అమ్మాయి - SKU Back   Home 
ఈ పేజీ ని పంపండి
"డియర్.. నేనూ క్రిస్ చర్చ్ కి వెళ్ళుతున్నాం." ఫ్రిజ్ కి వున్న స్లిప్ మీద రాసి వుంది. అంటే ఇంకో 3 గంటలు బోర్.. కప్ లో సోయా మిల్క్ పోసుకుని వచ్చి TV ముందు కూర్చున్నాను.

రాత్రి శాండ్రా తో జరిగిన సంభాషణ గుర్తుకి వచ్చింది. మేము ఇండియా వెళ్ళి వచ్చిన దగ్గరనుంచీ తమ మధ్య ఈ రకమైన వాదులాటలు సర్వసాధారణమై పోయాయి.

శాండ్రా ని నా friend శేఖర్ యింట్లో 6 ఏళ్ళ క్రితం క్రిస్ మస్ పార్టీ లో మొదటి సారి కలిసాను. చాలా ఆశ్చర్యం వేస్తుంది. కొత్తల్లో మాది ఒకరకంగా love at first sight అనే శాండ్రా యిప్పుడు అందరితో అదొక accident అని చెప్తుంటే ఒకరకమైన నిర్లిప్తత! సాధారణంగా.. యిక్కడ ప్రేమించుకున్నా.. పెళ్ళాడుకున్నా తమకి తగ్గ వారిని, అంటే తమ సంప్రదాయం వారిని, లేక కనీసం తమ దేశం వారిని చూసుకుంటారు. నేనేమీ అందుకు భిన్నం ఏమీ కాదు. కనుక ఆ రోజు శాండ్రా ని శేఖర్ పరిచయం చేసినపుడు ఆమెని అంతగా పట్టించుకోలేదు.. ఒక్క విష్యం మాత్రం ఒప్పుకోవాలి.. ఆమె చాలా అందంగా వుందని మాత్రం అనుకున్నాను.

రెండు రోజులు పోయాక నేను మళ్ళీ శేఖర్ యింటికి వెళ్ళినపుడు తను అక్కడికి వచ్చింది. యింటి బయట నా కారు చూసి పలకరిద్దామని వచ్చానంది. ఆమె అంతట ఆమె వచ్చింది.. సరదాగా మాట్లాడుతోంది.. కనుక నేనూ ఆమెతో సరదాగా మాట్లాడాను.

తను అలా వచ్చి మీద పడి మాట్లాడుతోంటే నాకేం చేదా? నేను కంప్యూటర్ ముందు కూర్చుని ఎదో type చేసి చూపిస్తుంటే.. వెనుకనుంచి నామీద ఆమె ఒంగి మాట్లాడుతున్నపుడు .. అమె అందాలు తగులుతూ గిలిగింతలు పెట్టాయి.. ఆమె అంత suggestive గా ఉంటే నేను మాత్రం మడి కట్టుకుని కూర్చున్నానా? యింకొంచెం ఆమెని కవ్వించాను. ఆమె కూడా ఆ game ని enjoy చేస్తోందన్నది స్పష్టం.

నా గురించి చెప్పాలంటే నేను మంచి కంపెనీ లో వుద్యోగంలో వున్నాను. మంచి సంపాదన వుంది. బుద్దిమంతుడి లెఖ్ఖలోకే వస్తాను. బాధ్యతలు ఏమీ లేవు.. దేశం కాని దేశంలో ఒక్కడ్నీ వున్నాను. నా అంతట నేను ఆమె వెంట పడలేదు.. ఆమే నా వెంట పడింది.. నా friends లో తెల్ల అమ్మాయిని girl friend గా పరిచయం చేయటం ధ్రిల్లింగ్ గా వుంటుందని తెలుసు.. అంతా నన్ను చూసి ఈర్ష్య పడతారనీ తెలుసు.. కనుక గొప్పకోసం శాండ్రా తో పరిచయం పెంచుకున్నాను.. కలిసి తిరగటం మొదలుపెట్టాం.

శాండ్రా వాళ్ళ తలితండ్రులు చిన్నపుడే విడిపోయారు. వాళ్ళ అమ్మగారు 3 సార్లు పెళ్ళి చేసుకున్నారు. తను ఒక రకంగా తలితండ్రుల మధ్య పంచుకోబడింది. వాళ్ళిద్దరికీ వేరువేరు పెళ్ళిళ్ళ వల్ల మొత్తం 8 మంది పిల్లలు వున్నారు. చిన్నప్పటి నుంచే పిల్లలంతా ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు. ఎవరికీ అంతగా చదువులు లేవు. శాండ్రా మాత్రం తన తలితండ్రుల్నీ, వారి పెళ్ళిళ్ళనీ చూసి.. తన జీవితం తన తల్లి జీవితం లా కాకూడదని ఎప్పుడూ కోరుకునేదట. నాతో ఎప్పుడూ భారతీయ కట్టుబాట్లనీ వారి బంధాలనీ గురించి అడిగి తెలుసుకునేది.. ఎక్కడో నాకనుమానం.. ఆమె భారతీయిడిని పెళ్ళి చేసుకోవాలన్న కోరిక తోనే నాతో చనువుగా వుంటోందెమో అని!

ఒకోసారి ఆమె మాటలు వింటూ సమయం తెలిసేది కాదు.. నేనూ ఆమెని ఆ దౄష్టితో మాత్రమే కాక ఆమె వ్యక్తిత్వం ని కూడా యిష్టపడటం మొదలెట్టాను. నేను తనని పెళ్ళి చేసుకుంటానని గట్టిగా అడిగితే మావాళ్ళు పెద్దగా అభ్యంతరం పెట్టరు.

నాకే ఎదో అనుమానం.. తనతో కలిసి.. మా సాంస్కౄతిక వైరుధ్యాలు మరచి సవ్యంగా కాపురం చేయగలనా అని! కానీ ఆమె మీద వున్న యిష్టం అవన్ని చిన్న చిన్న విష్యాలు అనిపించేలా చేసింది. ఆమె నాకు అన్ని రకాలుగా నచ్చింది. కనుక అన్నిటికీ సర్దుకుపోగలను అనుకున్నాను.

మా పరిచయం అయిన మొదటి valentine's day నాడు అమ్మాయిని అబ్బాయి అడిగే ఆ మేజిక్ question అడిగాను. ఆమె లో చెప్పలేనంత ఆశ్చర్యం.. ఆనందం.. "Yes.. Yes" అంటూ నన్ను గట్టిగా వాటేసుకుంది.

యిద్దరం కూర్చుని అన్ని విష్యాలూ మాట్లాడుకునాం. చిత్రంగా నా ప్రతీ సందేహానికీ ఆమె దగ్గర జవాబు వుంది. మా పిల్లల్ని రెండు సాంప్రదాయాలూ నేర్పించాలి అనుకున్నాం. యిద్దరమూ మా మతం మార్చుకోమనుకున్నాం.

మా యింట్లో ఒప్పించటం కొంచెం కష్టమే అయ్యింది.. అదేమితో.. వాళ్ళు వద్దు అన్నపుడు యింకా పట్టుదల (ప్రేమా..?) పెరిగింది. మొత్తానికి వాళ్ళు తెగతెంపులు అన్నారు.. నేనూ అంతే అన్నాను.. యింక శాండ్రా యింటిలో మేమిద్దరం పెళ్ళి అంటే వాళ్ళ అమ్మగారు కొన్ని సందేహాలు వెళ్ళబుచ్చారు.. తనూ, నేనూ వేరు వేరు దేశాల వాళ్ళం.. మా సంప్రదాయాలు వేరు వగైరా.. వగైరా.. కానీ అప్పటికే ఆ ప్రశ్నలు మమ్మల్ని మేము బోల్డు సార్లు వేసుకున్నాం కనుక.. వాటికి సరైన సమాధానాలు (convincing?) వున్నాయి అని ధైర్యంగా చెప్పాం.

యింకేమంటారు?? ఒప్పుకున్నారు. మా పెళ్ళి అయిపోయింది.

నా వాళ్ళు లేకపోవటం వెలితిగా వున్నా.. మనసుని సమాధానపరుచుకున్నాను. నాకంత పట్టింపు లేకపోయినా.. శాండ్రా కి నేను మన సంప్రదాయాన్ని గౌరవిస్తాను.. తను కూడా గౌరవించాలి అన్న పాయింట్ ని ప్రూవ్ చేయటానికి అనుకుంటా.. చర్చ్ లో పెళ్ళి అయ్యాక, నా friends ని పిలిచి గుడిలో కూడా పెళ్ళి చేసుకున్నాం.

నా friends కొత్తల్లో మా సంసారం ఎలా వుంది.. తను యింట్లో పని చేస్తుందా.. లేక నేను తనకి చేస్తున్నానా.. యింట్లో ఎవరి మాట చెల్లుతుందీ.. వంటి ఆసక్తి తో మమ్మల్ని వాళ్ళ యిళ్ళకి పిలిచేవారు. నాకూ శాండ్రా ని వాళ్ళు అలా సంభ్రమంగా చూడటం.. తనతో మాట్లాడటానికి తెగ పాట్లు పడటం.. ఆమెతో ఫొటోలు దిగటం.. చూసి సరదాగా , గర్వంగా వుండేది.

ప్రతీ వారూ దాదాపు ఒకటే ప్రశ్న .. నాలో ఏం చూసి తను యిష్టపడిందీ అని.. అందరికి మాది love at first sight అని చెప్పేది.. వాళ్ళు తనతో అన్న మాటలు శాండ్రా నాకు చెప్పినపుడు ఆ మాటల వెనుక నా ఫ్రెండ్స్, వాళ్ళ సతీమణుల ఈర్ష్య అర్థం అయి నవ్వుకునేవాడిని.

యింక ఆడవాళ్ళ విష్యానికి వస్తే.. నేను యిక్కడ నా friends భార్యలకి వ్యతిరేకం కాదు.. అయినా.. ఆమెతో మాట్లాడటానికి వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు పోటీ పడేవారు. ఆమె మగవాళ్ళతో కూర్చుని మాట్లాడటం.. తాగటం.. jokes వేయటం.. మరి వెనుక ఏం మాట్లాడుకునేవారో తెలీదు కానీ ఆమెలా వుండటానికి వాళ్ళూ ప్రయత్నించటం మొదలు పెట్టారు.

రమణ భార్య.. ఒకరోజు శాండ్రా లాంటి hair style చేయించుకున్నారు.. ఎప్పుడూ ఎక్కడికి వచ్చినా చీర కట్టుకుని వచ్చే వంశీ భార్య విజయ ఒకరోజు shorts వేసుకుని ప్రత్యక్షమయ్యారు.. రాజేష్ భార్య కవిత పుట్టినప్పటినుంచీ wine లో పుట్టినట్టు .. తను wine తప్ప ఎప్పుడూ వేరేది తాగననీ చెప్పడం.. నవ్వు వచ్చేది..

పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు!! ఈ మార్పు చూసి శాండ్రా ఒకోసారి అడిగేది.. మరి మీ వాళ్ళెవరూ నువ్వు చెప్పినట్టు మీ సంప్రదాయలని గౌరవించేవారిలా అనిపించరెందుకు అని! నేను "be a Roman in Rome" principle అని చెప్పేవాడిని.

శాండ్రా అంటే నా friends కుటుంబాల్లో ఆశక్తి చచ్చిపోయింది.. చిత్రంగా వాళ్ళ నుంచి నేను వేరు అయిపోయాను. అదివరకులా వాళ్ళు మా యింటికి రావటం లేదు.. శాండ్రా కి యిబ్బంది ఎమో అంటూ.. (నేనూ, శాండ్రా అదేం లేదని చెప్పినా..) వీకెండ్స్ ఏం చేయాలి?

ఎన్నాళ్ళు మేమిద్దరమే ఊళ్ళు పట్టుకుని తిరుగుతాము? వాళ్ళ భార్యలెదో మా వలన మారిపోయినట్టు సూటీపోటీ మాటలు ఒకటి!!

మా యింటికి ఫోన్ చేసి మాట్లాడితే.. శాండ్రా విష్యాలు తప్ప ఏమి మాట్లాడినా వినేవారు. తనని వాళ్ళు యింకా అంగీకరించలేదు. తననీ గౌరవించిన రోజే ఇండియా వస్తానని ఖచ్చితంగా చెప్పాను. శాండ్రా కి అర్ధం అయ్యేది కాదు.. ఎందుకు మా వాళ్ళకి తను నచ్చలేదన్న విష్యం.

ఆమెకి అందరూ తనని ప్రేమించాలని వుండేది. నేను యిప్పటికీ యింటికి డబ్బులు పంపటం అనే concept తనకి చిత్రంగా అనిపించేది. కానీ మన సంప్రదాయాలని గౌరవించేది. తన దౄష్టిలో సంప్రదాయం లేని వ్యక్తిగా ముద్ర పడకూడదని నేనూ నిర్లక్ష్యంతో ఒదిలేసిన పూజ వగైరా మొదలు పెట్టాను. మన దేవుళ్ళ గురించీ దేశం గురించీ అడుగుతుంటే.. తనకి చెప్పడం కోసం అవన్నీ తెలుసుకునే ప్రయత్నం మొదలు పెట్టాను. ఎప్పుడూ ఇండియా తీసికెళ్తావు అని నిరంతరం ప్రశ్నించేది.

చూస్తుండగానే.. మాకు ఒక బాబు పుట్టాదు. బాబుకి మా నాన్నగారి పేరు పెట్టాము. మా తలితడ్రులు కూడా వాడిని చూడాలని అడగటం మొదలు పెట్టారు.. నేను మళ్ళీ ఇండియా రావటానికి నా షరతు గుర్తు చేసాను. నాన్నగారు ఒకరోజు శాండ్రా కి ఫోన్ చేసి మమ్మల్ని ముగ్గురినీ ఇండియా రమ్మని పిలిచారు.

ఆశ్చర్యం వేస్తుంది.. నేనూ, శాండ్రా వద్దు అనుకుని 5 సంవత్సరాలు నాతో మాట్లాడటం మానేసారు నాన్నగారు.. యిప్పుడు బాబు పుట్టాక.. మేమిద్దరమూ ok

అయ్యాం.. అదేనెమో అసలు కంటే వడ్డి ముద్దు అంటే!

* * *

ఇండియా వెళ్ళాం.. అక్కడ శాండ్రా ని ఏ రకంగా receive చేసుకుంటారో అని భయపడ్డాను.. ఆముదాలవలస లో పుట్టి పెరిగిన అబ్బాయి అమెరికా వెళ్ళి అక్కడ అమ్మాయిని పెళ్ళిచేసుకుని వచ్చాడు అనేసరికి మా చుట్టుప్రక్కల అందరూ ఒకరకంగా గుంపులు కట్టారు మా యింటి ముందు.

మా అమ్మ, నాన్నగారు ఆమెని మర్యాదగానే చూశారు. వాళ్ళకి ఒకటే సంతోషం.. పెళ్ళి అయ్యాక శాండ్రా నన్ను తన వైపు తిప్పుకోలేదనీ.. తమనుంచి నేను దూరం అయినందుకు నిజంగా బాధ పడి, మమ్మల్ని కలపటానికి ప్రయత్నించిందన్న భావం. ఈ విష్యం తెలుసుకోవటానికి మరి వాళ్ళకి 5 సంవత్సరాలు ఎందుకు పట్టాయో మరి దేవుడికెరుక!

ఆ సంతోషంలో వాళ్ళు మేము ఇండియా వచ్చేస్తామన్నట్టు మాట్లాడటం మొదలెట్టారు.. మా కోసం అక్కడ ఏమేమి కొన్నారో.. నా పేర్న కొన్న యింటిలో తనకోసం ఏ ఏ సౌకర్యాలు అమర్చారో చూపించారు.

నా గొంతులో పచ్చవెలక్కాయ పడినట్టు అయింది. యిప్పుడిప్పుడే మళ్ళీ నాతో నాన్నగారు మాట్లాడుతున్నారు.. యిప్పుడే నాకు ఇండియా వచ్చేసే వుద్దేశ్యం లేదని చెప్పి ఆయన సంతోషం ని పాడు చేయబుద్ది కాలేదు. చెప్తే వాళ్ళ దౄష్టిలో మరింత చెడు అవుతాను.. అది సహజంగా శాండ్రా మీదకి మళ్ళుతుంది. ఏం చేయాలి?

శాండ్రా నన్ను అడిగింది.. "ఇదంతా ఏమిటి? ఇండియా వెళ్ళిపోతున్నామా?" అని..

నేను మనం దీని గురించి తర్వాత మాట్లాడుకుందామని చెప్పాను.

ఇది ఆమె అనుమానాలని పెంచింది. అంతే కాక అక్కడ చాలా విష్యాలు ఆమెకి అర్థం కాలేదు, నచ్చలేదు. తను అనుకున్నదానికీ చూసినదానికీ మధ్యనున్న విపరీతమైన తేడా ఆమెకి మింగుడుపడలేదు.

మా నాన్నగారు మా అమ్మని కంట్రోల్ చేసే విధానం చూసి నాన్నగారిని చాలా అయిష్టపడింది. నాన్నగారు కూడా మా ఎదురుగా యింకొంత ఎక్కువ చేసారు. మరి ఏ పాయింట్ ని ప్రూవ్ చేయటానికో!!! నాన్నగారే కాదు మేము వెళ్ళిన ప్రతీ చోటా ఆడవాళ్ళు తమ భర్తల చేతిలో పడుతున్న కష్టాలు చూసి చాలా భయపడింది.

నాన్నగారు యధాలాపంగా అన్నట్టు అన్నారు.. బాబుని అక్కడ ఉంచమని. తను చర్చ్ కి బాబుని తీసికెళ్ళటం తనకి యిష్టం లేదన్న విష్యం స్పష్టంగా వ్యక్తపరచారు.

మేము అక్కడనుంచి ఇండియా టూర్ కి బయలుదేరే రోజు నాన్నగారితో ఒంటరిగా వున్నపుడు ఖచ్చితంగా చెప్పాను.. తను ఈ విధంగా ప్రవర్తించటం వలన నాకూ శాండ్రా కీ మధ్య గొడవలు పెరగటమే తప్ప మరేమీ అవదనీ.. ఆమెని ఈ రకంగా భయపెట్టి తన పంతం నెగ్గించుకోలేరనీ.

ఆయన రుద్రుడే అయ్యారు.. శాండ్రా ని ఏవేదో అన్నారు. నేనేం చేస్తాను? నాకు యిద్దరూ కావాలి.

శాండ్రా నా వాళ్ళని ఒదిలేయమని చెప్తోందా? చెప్పినా నేను వింటానా? అదే రకంగా మా వాళ్ళు తనని ఒదిలేయమని చెప్పినా వినను. నాకు యిద్దరూ ముఖ్యం.

తర్వాత నేను కొంచెం కలతగా వుండటం గమనించింది. ఏమిటి అని అడిగే శాండ్రా కి ఏం చెప్తాను? నాన్నగారు అన్న మాటలు చెప్పి అసలే అభద్రతా భావంలో వున్న తనని యింకా భయపెట్టనా?

నా మౌనం కూడా పరిస్థితిని ఏ మాత్రం చక్కదిద్దలేక పోయింది. నేనలా aloof గా వుండటం ఆమెకి నేనెదో వేరే ఆలోచనల్లో వున్నట్టు అనుమానం కలిగించింది.

అమెరికా తిరిగి వచ్చాక ఆమెలో ఈ భయం మరింత ఎక్కువ అయింది. నేను తనకి ఇండియా తిరిగి వెళ్ళకపోవటం గురించి ఖచ్చితంగా మాట యివ్వలేకపోయాను. నాకూ అక్కడకి వెళ్ళి తిరిగి వచ్చాక, నేను ఒదులుకున్నది ఏమిటో తెలుస్తూ బాధ వేస్తోంది. ఎదో అసంతౄప్తి.. అసలు ఖంగారు పడి పెళ్ళి చేసుకుని వుండకూడదు అని!

బాబు పెంపకంలో మా మధ్యనున్న తేడాలు కనిపించడం మొదలు పెట్టాయి. చిత్రంగా మేము అదివరకు చేసుకున్న ఒప్పందాలూ అన్నీ మర్చిపోతున్నాము. మా యిద్దరమూ ఏ విష్యం గురించి మాట్లాడుకున్నా చివరికి మా భవిష్యత్తు గురించి పోట్లాటలోకి దిగుతున్నాము.

మేమింతగా ఆలోచించి మా మనసుల్ని పాడు చేసుకోవటం అనవసరమన్న విష్యం యిద్దరికీ తెలుసు.. కానీ నాలో ఎదో అసంతౄప్తి.. తనలో ఎదో అనుమానం!

ఒక్కటి మాత్రం నిజం. ప్రస్తుతం మా యిద్దరికీ ఒకరిని విడిచి ఒకరు వుండలేమన్నంత ప్రేమ లేకపోయినా, మా పంతాలకి పోతే మా బాబు భవిష్యత్తు పాడవుతున్నదన్న విష్యం యిద్దరికీ తెలుసు. తనకీ మేమిద్దరం విడిపోతే మా బాబు కూడా తనలాగా తండ్రి ప్రేమకి దూరమౌతాడని తెలుసు. అటువంటి పరిస్థితి ఎప్పటికీ రానీయదు. మా యిద్దరి పంతం లో ఎవరు గెలిచినా రెండో వారు వారిని అనుసరిస్తాము తప్ప నా దారి వేరు అని విడిపోము.

మా యిద్దరి ప్రేమే మా బాబుకి మేము యిచ్చే బంగారు కానుక.
* * End * *

మీ సూచనలూ, సలహాలూ రచయిత్రి SKU కి తెలియచేయండి.